ఫెడరేషన్ ఆశయాలు
- భారత రాజ్యాంగంలో నిర్ధేశించబడిన సమసమాజ నిర్మాణ ధ్యేయం గల శాస్త్రీయ విద్యా విధానమును సాధించుట.
- (ఎ) విద్యను ప్రాథమిక హక్కుగా 0-18 సంవత్సరముల వరకు అమలుపరచుటకు కృషిచేయుట.
(బి) విద్యారంగంలో ప్రైవేటు మరియు పి.పి.పి. భాగస్వామ్య పద్ధతులను వ్యతిరేకించుట.
(సి) ఇరుగు పొరుగు బడి పద్ధతిలో కామన్ స్కూల్ విధానం అమలు పరుచుటకు కృషి చేయుట. - వివిధ యాజమాన్యాల స్థానంలో విద్యాధికారుల, ఉపాధ్యాయ – విద్యార్థి ప్రతినిధుల, ప్రజా ప్రతినిధుల, విద్యావేత్తలతో కూడిన చట్టబద్ధమైన విద్యా బోర్టును ఏర్పరచుటకు, వాటి ద్వారా విద్యాపాలన సాగించుటకు
కృషిచేయుట. - అన్ని దశలలోని విద్యా వ్యాప్తిని, విద్యాభివృధిని సాధించుట ప్రజల విజ్ఞానాభివృద్ధి కొరకు పాటుపడుట.
- స్థానిక వనరులను వినియోగించుకొనే పరిశోధనలు జరిపే విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అభివృద్ధిపరచుట.
- విద్యాపాలన, బోధన అన్ని స్థాయిలలోను మాతృభాషలోనే సాగించుట.
- విద్యారంగ సమస్యలకు సంబంధించిన గ్రంథములు, కరపత్రములు, పత్రికలు, విద్యావిషయక సాహిత్మమును ప్రచురించుట.
- తెలంగాణలో ఉన్న ఉపాధ్యాయులనందరిని ఒకే సంఘంగా ఏర్పరచుట. ఉపాధ్యాయుల, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడునట్లు సమగ్ర విద్యా చట్టాన్ని సవరించుటకు కృషిచేయుట.
- ఎ. ఉపాధ్యాయుల ఆర్థిక, సాంఘిక భద్రతకు కృషిచేయుట.
బి. ఉపాధ్యాయుల సాంస్కృతిక, వైజ్ఞానిక, అభివృద్ధితో బాటు సామాజిక బాధ్యతలను గుర్తింపజేయుట.
సి. ఉపాధ్యాయ సంఘాలకు ట్రేడ్ యూనియన్, రాజకీయ హక్కుల సాధనకు కృషిచేయుట. - కేంద్ర ఉపాధ్యాయులకు గల వేతన తదితర సదుపాయాలు రాష్ట్ర ఉపాధ్యాయులకు వర్తింపచేయుటకు
కృషిచేయుట. - విద్యకు సంబంధించిన అన్ని స్థాయిల కమిటీలలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించుట.
- విద్యారంగంలో అవినీతి, అక్రమాల నిర్మూలనకు కృషి చేయుట.
- పౌరహక్కుల, ప్రజాస్వామ్య హక్కుల రక్షణకు కృషి చేయుట.
- పీడన, అణచివేత, అనుమానతలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలను ప్రజాతంత్ర ఉద్యమాలుగా ఫెడరేషన్ గుర్తించి, ‘ప్రజాతంత్ర ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించుట.