History of TPTF – ఫెడరేషన్ ఉద్యమ ముఖ్య ఘట్టాలు

ఫెడరేషన్ ఉద్యమ ముఖ్య ఘట్టాలు (History of TPTF)

  • 1939 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మలబారు ఉపాధ్యాయులు సాగించిన చారిత్రక సమ్మె.
  • 1944 ఏప్రిల్ 16-సత్యపుత్రశర్మ, రామజోగారావు, మాణిక్యాంబ గార్ల నాయకత్వంలో తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో ప్రాథమికోపాధ్యాయ మహాసభ నిర్వహణ, రాష్ట్రస్థాయిలో ప్రాథమి కోపాధ్యాయసంఘస్థాపన.
  • 1947 ఏప్రిల్ 19-20 : ఆంధ్రరాష్ట్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ పునరుద్ధరణ – గుంటూరులో ద్వితీయ మహాసభ – రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా చెన్నుపాటి లక్ష్మయ్య, ప్రధానకార్యదర్శిగా పి. రామసుబ్బయ్య ఎన్నిక.
  • 1947 జూన్ 25 : ఉపాధ్యాయుల రాష్ట్ర వ్యాపిత సమ్మెకు పిలుపు సమ్మె ప్రారంభం కాకమునుపే ప్రభుత్వం దిగివచ్చి జూన్, 5వ తేదీన జీతాలు పెంచుతూ ఉత్త ర్వులు జారీ. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తొలిసారిగా టైం స్కేలు వర్తింపు.
  • 1948 ఫిబ్రవరి 20- ఆంధ్రరాష్ట్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ తృతీయ మహాసభ – విజయవాడలో ఫెడరేషన్ అధికార వాణిగా ‘ఉపాధ్యాయ’ తొలి సంచిక ఆవిష్కరణ.
  • 1951 అక్టోబరు 19 – సంఘస్థాపనా హక్కును నిరాకరించిన 416 జీ.వో. రద్దుకు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సింగరాజు రామకృష్ణయ్యమద్రాసు హైకోర్టులో ప్రభుత్వంపై దాఖలు చేసిన దావాపై రాజ్యాంగం ప్రసాదిం చిన ప్రాథమిక పౌర హక్కులకువిరుద్ధమని ప్రకటిస్తూ, రద్దు పరుస్తూ, మద్రాసు హైకోర్టు యిచ్చిన చారిత్రక తీర్పు.
  • 1952 జూలై-ఉపాధ్యాయ నియోజక వర్గాలకు మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక స్థానానికి ఫెడరేషన్ అభ్యర్ధిగా సింగరాజు రామకృష్ణయ్య అఖండ విజయం.
  • 1953 ఏప్రియల్ 23, 24, 25- ఫెడరేషన్ చతుర్థ మహాసభ కాకినాడలో ఫెడరేషన్ ఆశయాలు, ఆదర్శాలు, కార్య క్రమాలకుసంబంధించిన అంశాలకు శాస్త్రీయమూ, ప్రామాణి కమూ అయిన పాలసీ స్టేట్మెంట్కు రూపకల్పన చేసిన చారిత్రాత్మకమహాసభలివి.
  • 1953 జూలై 21, 24- వియన్నాలో జరిగిన ప్రథమప్రపంచఉపాధ్యాయ ఫెడరేషన్ మహాసభకు ఫెడరేషన్ ప్రతినిధిగా నిధిగా సింగరాజుకుఆహ్వానం-పాస్పోర్టు నిరాకరణ యీచర్యకు మహాసభ ఖండన-పార్లమెంట్లో ప్రస్తావన.
  • 1954 మే 5 నెల్లూరులో ఫెడరేషన్ అయిదవ మహాసభల నిర్వహణ.
  • 1956 మే 19, 20, 21- ఫెడరేషన్ ఆరవ మహాసభ – గుంటూరులో.
  • 1958 నవంబరు 30, డిసెంబరు 1 సమితి, జిల్లా పరిషత్తులకు పాఠశాలలపై అధికార ప్రాప్తి.
  • 1961 ఏప్రిల్ – త్రివిధ సౌకర్యాల (పెన్షన్-ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ బెనిఫిట్ స్కీము) ప్రకటన.
  • 1962 జూలై 8-సర్కారు జిల్లాలకు కేటాయించిన నాలుగు ఉపాధ్యాయ నియోజకవర్గాలలో ఫెడరేషన్ మూడు స్థానాలను గెలుచుకుంది. గెలిచిన అభ్యర్ధులు చెన్నుపాటి లక్ష్మయ్య, పి.శ్రీరామమూర్తి, ఎస్.టి.పి. కూర్మాచార్యులు.
  • 1965 మే 20, 21, 22 ఫెడరేషన్ ఎనిమిదవ మహాసభలు – తిరుపతిలో.
  • 1969 జూన్ 3, 4, 5- ఫెడరేషన్ తొమ్మిదవ మహాసభలు- గుడివాడలో ఎం. బాలకృష్ణమ్మ అధ్యక్షులుగా, సింగరాజు రామకృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక.
  • 1970 ఏప్రియల్ 27 ఉపాధ్యాయుల వేతన సవరణ.
  • 1970 జూలై-తూర్పురాయలసీమ టీచర్స్ నియోజకవర్గం నుండి సింగరాజుతిరిగిఎం.ఎల్.సిగా ఎన్నిక.
  • 1971 ఏప్రిల్ 5- రాష్ట్ర ఉపాధ్యాయుల, ఎన్.జీ.వోల 56 రోజుల చారిత్రక సమ్మె వైఫల్యానికి నిరసనగా కార్యాచరణ కమిటీకి సింగరాజు రాజీనామా : సమ్మె విరమణ పట్ల ఫెడరేషన్ వైఖరి విస్పష్టం చేస్తూ ‘సమ్మె సమీక్ష’ పుస్తక ప్రచురణ.
  • 1972 ఫిబ్రవరి 16-ఏపిటియఫ్ ఆందోళనా ఫలితంగా సమస్యల పరిష్కారానికి కో-ఆర్డినేషన్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు.
  • 1972 మే15, 16, 17, 18 – ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ 10వ మహాసభలను, సంస్థ – ఉపాధ్యాయ రజతోత్సవాలను విజయవాడలో వైభవంగా నిర్వహణ, నిబంధనావళి సవరణ ద్వారా ప్రాథమిక మొదలు సెకండరీ, కాలేజి, యూనివర్శిటీ స్థాయి వరకూ గల ఉపాధ్యాయులందరికీ ఫెడరేషన్ అధికార రీత్యా ప్రవేశం కల్పించింది. తద్వారా ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏ.పి.ఇ.టి.యఫ్) ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏ.పి.టి.యఫ్)గా మార్పు.
  • 1973 ఏప్రియల్-లిబరలైజ్డ్ పెన్షన్ పథకం ఉపాధ్యాయులకు వర్తింపు.
  • 1974 ఏప్రిల్-పే కమిటీ రిపోర్టు/పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల సెలక్షన్ గ్రేడ్, డి.ఏ మెర్జెడ్ స్కేళ్లు అమలు. జూలై- సర్కారు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులు ఎం. బాల కృష్ణమ్మ, ఏ.పి.టి.యఫ్. బలపరిచిన అభ్యర్థులు దండు శివరామరాజు, ఎం.జె. మాణిక్యారావు ఎన్నిక.
  • 1974 సెప్టెంబర్ 27 – డి.ఏ. మెర్జెడ్ స్కేల్సు మంజూరు.
  • 1975 మే 26, 27, 28 అనంతపురం పట్టణంలో ఏ.పి. టి.యఫ్. 11వ విద్యావైజ్ఞానిక మహాసభలు. ఇవి రాయలసీమ జిల్లాల్లో విస్తరణకు తోడ్పడ్డాయి.
  • 1975 డిసెంబర్ 26-31 బోంబాయిలో అఖిల భారత విద్యా సంస్థల సమాఖ్య స్వర్ణోత్సవాలు.
  • 1976 జూలై-జాయింట్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఏక్షన్ (జె.సి.టి.ఏ) పేరుతో పనిదినాల, పనిగంటల పెంపుదల సమస్యపై ఉపాధ్యాయ సంఘాల సమైక్య పోరాట వేదిక ఏర్పాటు.
  • 1976 డిసెంబరు 15 : ప్రభుత్వంతో చర్చలు – పెంచిన పనిదినాల తగ్గింపు
  • 1976 డిసెంబరు 26-31 : ఐఫియా 52వ మహాసభలు – ఢిల్లీలో – ఏ.పి.టి.యఫ్ తరపున వెయ్యిమంది పాల్గొన్నారు.
  • 1977 మే-ఏ.పి.టి.యఫ్. తీవ్ర కృషి, చొరవతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాస్ట్రో) స్థాపన – జె.సి.టి.ఎ. రద్దు.
  • 1978 ఏప్రియల్ – వేతన స్కేళ్ళ రివిజన్.
  • 1979 మే 28 నుండి 31 : విజయనగరం పట్టణంలో ఏ.పి.టి.యఫ్. 12వ విద్యావైజ్ఞానిక మహాసభలు.
  • 1979 మార్చి 19న ఫ్యాప్టో ఛైర్మన్ గా సింగరాజు ఎన్నిక.
  • 1980 జూలై6-సర్కారు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలలో ఎం. బాలకృష్ణమ్మ తిరిగిఎన్నిక – మిగతా 3నియోజక వర్గాల్లో ఏ.పి.టి.యఫ్. అభ్యర్ధులు పిళ్ళా సుబ్బారావు, మర్రివాడగోపాలకృష్ణమూర్తి, న్.సుబ్బారావు ఓటమి.
  • 1981 జూన్-పాత అగ్రిమెంటులోని అంశాలన్నింటి సారాంశంగా ఏకవాక్య అగ్రిమెంటుతో ఎయిడెడ్ టీచర్లకు డైరెక్టు పేమెంట్ పద్ధతిఅమలు.
  • 1981 సమగ్ర విద్యాబిల్లుకు అసెంబ్లీ ఆమోదం.
  • 1982 అక్టోబరు 7-ఆర్ధికమంత్రితో రీ గ్రూపింగ్ స్కేళ్ళకు ఒప్పందం.
  • 1982 డిసెంబరు 17 – రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమ్మె రీ గ్రూపింగ్ స్కేళ్ళ జీ.వో. విడుదల.
  • 1983 ఫిబ్రవరి 6 – ఏ.పి.టి.యఫ్. నిర్మాణం తెలంగాణా ప్రాంతానికి విస్తరణ ప్రారంభం.
  • 1983 జూన్ 15-19 ఏ.పి.టి.యఫ్ ఆధ్వర్యాన ఐఫియా. మహాసభలు విశాఖపట్నంలో నిర్వహణ.
  • 1984 మార్చి 6 నుండి 19 వరకు ఫ్యాప్టో సమ్మె ఒప్పందం.
  • 1984 నవంబరు 11 -అధ్యక్షులుగా ఆర్. రవీంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సింగరాజు ఎన్నిక.
  • 1985 ఫిబ్రవరి 4 నుండి 13-సెక్రటేరియట్ వద్ద ఏ.పి.టి.యఫ్. రిలే నిరాహారదీక్షలు.
  • 1985 ఫిబ్రవరి 14-ఏ.పి.టియఫ్. పక్షాన ‘ఛలో రాజభవన్’ మహాప్రదర్శన-లక్షా పాతిక వేల సంతకాలతో
  • గవర్నర్కు మహా విజ్ఞాపన పత్రం సమర్పణ.
  • 1986 “రాష్ట్ర వ్యాపిత ఉపాధ్యాయుల సమ్మె” మార్చి 6 నుండి 24 వరకు సమ్మె-అర్ధరాత్రి ఫ్యాప్టో సమ్మె విరమణ ఫలితంగా ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలు.
  • 1986 మార్చి 27 – సమ్మె విరమణ పద్ధతికి నిరసనగా ఫ్యాప్టో కార్యదర్శి పదవికి ఏ.పి.టి.ఎఫ్ అధ్యక్షులు రాజీనామా.
  • 1986 జూలై14 – పేకమీషన్ డి.ఏ. మెర్జెడ్ స్కేల్స్పై నివేదిక సమర్పణ – యధాతథంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం.
  • 1986 ఆగస్టు 22 నుండి 24 ఏ.పి.టి.యఫ్. 13వ మహాసభలు కరీంనగర్లో నిర్వహణ. విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం.
  • 1987 జూన్ 9-విజయవాడలో ఏ.పి.టి.యఫ్. నలభై వసంతాల ఉత్సవాల ప్రారంభ సభలు.
  • 1987 డిసెంబర్ – ఆర్. రవీందర్రెడ్డి ఫ్యాప్టో సెక్రటరీ జనరల్గా ఎన్నిక.
  • 1988 ఫిబ్రవరి 13, 14: హైదరాబాదులో ఏ.పి.టి.యఫ్. 40 వసంతాల ముగింపు ఉత్సవాలు.
  • 1988 నవంబరు 12- విజయవాడలో ‘ఉపాధ్యాయ’ 40 వసంతాల ఉత్సవ సభలు.
  • 1988 డిసెంబర్ 15 – – ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంయుక్త కార్యాచరణ సమితి (జె.ఎ.సి.) ఆవిర్భావం.
  • 1989 మార్చి 16-జె.ఎ.సి. పిలుపు మేరకు 2 లక్షలకు పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ‘ఛలో అసెంబ్లీ’ ప్రదర్శన.
  • 1989 అక్టోబరు 22-ఉద్యోగుల, ఉపాధ్యాయుల కార్మికుల 18 సమస్యలపై ప్రబుత్వం జె.ఎ.సితో ఒప్పందం.
  • 1991 మార్చి 10 – ఏ.పి.టి.యఫ్. అధ్యక్షులుగా ఎ. నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సింగరాజు ఎన్నిక.
  • 1991 మే 4, 5, 6-‘సామాజిక సంక్షోభం-విద్యావిధానం’ ఏ.పి.టి.యఫ్. 14వ విద్యా వైజ్ఞానిక మహాసభలు ఒంగోలులో నిర్వహణ.
  • 1992 ఫిబ్రవరి 24 – పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఏ.పి.టి.యఫ్ పక్షాన ధర్నా.
  • 1992 ఫిబ్రవరి 25 నుండి ఏప్రియల్ 3 వరకు 39 రోజులపాటు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా సచివాలయంముందు రిలే నిరాహారదీక్షలు. ఏపిటియఫ్. ప్రతినిధులతో చర్చలు- అంగీకరించిన 12 సమస్యలపై 3.4.1992న మినిట్స్ కాపీ జారీ ఫలితంగా రిలే నిరాహారదీక్షల విరమణ.
  • 1992 సెప్టెంబర్ 21 – అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు విద్యారంగ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఏ.పి.టి.యఫ్ పక్షాన ధర్నా,
  • 1993 మార్చి 5 నుండి నిరవధిక సమ్మె ఫ్యాప్టో-జాక్టా యిచ్చిన పిలుపుతో ప్రభుత్వంతో చర్చలు జరిగి వాటి పరిష్కారానికి ఒప్పందం ఆమోదం, సమ్మె ప్రతిపాదన విరమణ.
  • 1993 మే 20 – 1993 – పి.ఆర్.సి. సవరణ వేతన స్కేళు ప్రకటన.
  • 1994 ఫిబ్రవరి 18న జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లాశాఖల ఆధ్వర్యంలో ధర్నా.
  • 1994 జూన్ 4, 5 – తూ. గో. జిల్లా మండపేటలో ఫెడరేషన్ అవతరణోత్సవ సభలు. ‘సామాజిక ప్రగతికి విద్య’ ప్రధాన చర్చనీయాంశంగా విద్యా సదస్సు నిర్వహణ. సింగరాజు రామకృష్ణయ్య, పి. మాణిక్యాంబ గార్లకు సన్మానం, సింగరాజు గార్కి పర్సు బహూకరణ.
  • 1995 ఏప్రిల్ 22- ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రాలలో ఏ.పి.టి.యఫ్. ర్యాలీ.
  • 1995 గుర్తింపు కలిగిన సంఘాల ఆధ్వర్యంలో సి.సి.ఆర్. టి.యు. ఏర్పాటు. ఫ్యాప్టో ఐక్య ఉద్యమానికి విఘాతం, పాలకుల విభజించు పాలించు సూత్రానికి తోడ్పాటు.
  • 1995 జూలై 31- విద్యా బిల్లు నుండి విద్య – ఉపాధ్యాయ వ్యతిరేకమైన క్లాజుల ఉపసంహరణకు, అంగీకరించిన అంశాలపైన ఉత్తర్వుల జారీకి ఫ్యాప్టో ఆధ్వర్యాన కలెక్టరేట్ల ముందు ధర్నా.
  • 1995 అక్టోబరు 4- హైద్రాబాద్లో సచివాలయం ముందు ఫ్యాప్టో దర్నా.
  • 1995 నవంబరు-ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘ భవనాల నిర్మాణాలకు అప్పుగా మంజూరు చేసిన ఉత్తర్వు, సస్పెన్షన్, రూ.10/-లు చొప్పున వసూళ్ళను నిలుపు దల చేస్తూ హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు.
  • 1996 ఫిబ్రవరి 16- రాజధానిలో రాష్ట్ర సచివాలయం వద్ద ఫ్యాప్టో పికెటింగ్.
  • 1996 మార్చి 6 – రాజధానిలో ఫ్యాప్టో ర్యాలీ.
  • 1996 జూన్ – ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంక్షేమ నిధి నుండి అప్పు తీసుకున్నవారే చెల్లించాలి, హైకోర్టు సంచలనాత్మక తీర్పు.
  • 1996 జూన్-పోటీ ఏ.పి.టి.యఫ్. నుండి జి. సింహాద్రప్పడు ఆర్. అప్పయ్యల నాయకత్వాన విశాఖ, పశ్చిమ గోదా వరి, ఖమ్మం జిల్లాలు పూర్తిగాను, శ్రీకాకుళం, విజయ నగరం జిల్లాల్లో పాక్షికంగాను, మాతృసంస్థలో విలీనం.
  • 1996 జూలై 22 – సమస్యల సాధనకు మండల, పట్టణ నగర కేంద్రాలలో ఫ్యాప్టో ధర్నా.
  • 1996 సెప్టెంబర్ 5 – జిల్లా కేంద్రాలలో ఫ్యాప్టో పక్షాన ఉపాధ్యాయ దినోత్సవ బహిష్కరణ – ర్యాలీ.
  • 1996 అక్టోబరు-టెను స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణ -స్పాట్ వాల్యుయేషన్ రేట్లు పెంపుదల.
  • 1996 డిసెంబర్ 1న హైద్రాబాద్ లో ఏ.పి.టి.యఫ్. ఆధ్వ ర్యంలో ‘విద్యాప్రమాణాల పెంపుదల-కర్తవ్యాలు అంశంపై రాష్ట్ర సెమినార్.
  • 1997 జూన్ 3న ఉపాధ్యాయ సంఘాలతో 44 సమస్యలపై గిరిజన సంక్షేమశాఖామాత్యులు జి.నగేష్ ఆధ్వర్యంలో చర్చలు.
  • 1997 జూలై 11,12,13 తేదీలందు విజయవాడలో ఏ.పి. టి.యఫ్. ఉపాధ్యాయ స్వర్ణోత్సవ మరియు 15వ మహాసభలు – బ్రహ్మాండమైన ఊరేగింపు – అపూర్వ రీతిలో జయప్రదం – ఏ.పి.టి.యఫ్. ఉపాధ్యాయ, సావనీర్లు విడుదల.
  • 1997 అక్టోబరు 3న సెక్రటేరియట్ ఎదుట ఫ్యాప్టో పికెటింగ్, విచక్షణారహితంగా సాగిన ఉపాధ్యాయుల అరెస్టులు – ప్రభుత్వ దమనకాండ.
  • 1997 డిసెంబర్ 4న జె.ఎ.సి. నాయకులతో చర్చలు, 8 సమస్యల పైన ఉత్తర్వులు జారీచేయటానికి, 19 సమస్యల పైన చర్చలకుఅంగీకారం, సమ్మె ప్రతిపాదన విరమణ.
  • 1997 డిసెంబర్ 5 నుండి ఫ్యాప్టో నిరవధిక నిరాహారదీక్షలు విద్యామంత్రి హామీతో 09-12-97న విరమణ.
  • 1997 డిసెంబర్ 12న ఏ.పి.టి.యఫ్.కు గుర్తింపు తదితర సమస్యల పరిష్కారానికి హైదరాబాదులో వేలాదిమంది ఉపాధ్యాయులతో ధర్నా.
  • 1998 మార్చి 3న విద్యాశాఖలో పేరుకుపోతున్న సమస్యల సాధనకు హైదరాబాద్లో ఏ.పి.టి.యఫ్. ధర్నా.
  • 1998 మే 13న ఏ.పి.టి.యఫ్. పక్షాన పి.ఆర్.సి.కి మెమోరాండం సమర్పణ.
  • 1998 మే 26న కాబినెట్ సబ్కమిటీతో 22 సమస్యలపై ఫ్యాప్టో చర్చలు.
  • 1998 జూలై 4న హైద్రాబాద్లో వందలాది మంది ఉపాధ్యాయులతో ఫ్యాప్టో ధర్నా.
  • 1998 జూలై 20 నుండి 25 వరకు పాత తాలూకా కేంద్రాల్లో ఏ.పి.టి.యఫ్. ధర్నా.
  • 1998 అక్టోబర్ 7న లక్షమంది ఉపాధ్యాయులతో మండల కేంద్రాలలో పోరాట సమితి ధర్నా.
  • 1998 అక్టోబరు 15న 20 వేల మంది ఉపాధ్యాయులతో ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో హైద్రాబాద్లో పికెటింగ్.
  • 1998 నవంబర్ 3 నుండి పోరాట సమితి నాయకత్వంలో సమ్మె- 8 డిమాండ్లపై క్యాబినెట్ సబ్ కమిటీ పోరాట సమితిల మధ్య నవంబరు 1, 3 తేదీలందు చర్చలు – ఒప్పందం అంగీకారం – సమ్మె ప్రతిపాదన విరమణ.
  • 1999 నవంబర్ 15 రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మూడవ దశగా ఏ.పి.టి.యఫ్. ధర్నా.
  • 1999 డిసెంబరు 16 హైద్రాబాద్ లో ఏ.పి.టి.యఫ్. ఆధ్వర్యంలో “అందరికి విద్య-సామాజికావసరం” అంశంపై విద్యా సెమినార్.
  • 2000 ఏప్రిల్ 1న ఉపాధ్యాయసంఘాల పోరాటసమితితో విద్యామంత్రిచర్చలు – ఒప్పందం – 5అంశాలపై జీ.వో.లు జారీ.
  • 2000 డిసెంబర్ 16, 17 – వరంగల్ జిల్లా హన్మకొండలో ఏ.పి.టి.యఫ్. తెలంగాణా ప్రాంతీయ విద్యా మహా సభలు విజయవంతంగా నిర్వహణ.
  • 2001 జులై 16 – ఏ.పి.టి.యఫ్. ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా.
  • 2001 సెప్టెంబర్ 4-జె.సి.టి.ఏ. ఆధ్వర్యంలో హైద్రాబాద్లో 5000 మందితో ధర్నా.
  • 2002 జూలై 24-జె.సి.టి.ఏ. ఆధ్వర్యాన హైదరాబాద్లో 20 వేల మంది ఉపాధ్యాయులతో ర్యాలీ, బహిరంగ సభ, స్పీకర్కు మెమోరాండం సమర్పణ.
  • 2003 సెప్టెంబర్ 23 – 774 ఉత్తర్వును రద్దుచేసి, ప్రాథమిక విద్యను పరిరక్షించాలని, విద్యాశాఖ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్చే స్తూ జెసిటీఏ ఆధ్వర్యాన హైద్రాబాద్ లో భారీ ప్రదర్శన నిర్వహణ- ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పణ.
  • 2003 డిసెంబరు 10- ట్రైబల్ వెల్ఫేర్ కమీషనర్ తో చర్చలు – మినిట్స్ జారీ. ఫలితంగా డిసెంబరు 12న ఏ.పి.టి.యఫ్. తలపెట్టిన ధర్నా కార్యక్రమం వాయిదా.
  • 2003 డిసెంబరు 16 – పిఆర్సి నియామకానికి, కామన్ సర్వీసూల్స్ రూపొందించాలని, డియస్సి నియామకాలు ఉండాలన్న వగైరా డిమాండ్ల సాధనకోసం హైదరాబాద్లో జెసిటిఎ ధర్నా.
  • 2003 డిసెంబరు 18- పిఆర్సిని నియమించాలని, ఒప్పం దాలు అమలు జరపాలని వగైరా డిమాండ్ల కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట జె.ఎ.సి. ధర్నా.
  • 2004 ఫిబ్రవరి 17 – అన్ని సౌలభ్యాలు ఎయిడెడ్-మున్సిపల్ ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లల ముందు ధర్నా.
  • 2004 జూలై 7 – ఏపిటిఎఫ్కు ప్రభుత్వ గుర్తింపు ఇస్తూ 167 జీవో జారీ.
  • 2004 జూలై 10,11,12 అనంతపురంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర 16వ విద్యా వైజ్ఞానిక మహాసభలు ఘనంగా నిర్వహణ, భారీ వూరేగింపు, ఏపిటిఎఫ్ సావనీరు- సాహిత్యం ఆవిష్కరణ.
  • 2004 అక్టోబరు 18, 19 – ఏపిటిఎఫ్ జనరల్ కౌన్సిల్ నిర్వహణ. 8మంది రాష్ట్ర నాయకుల పదవీ విరమణనూతన అధ్యక్షులుగా కె.వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.వి. రాఘవయ్య ఎన్నిక.
  • 2004 అక్టోబరు 27- ఉమ్మడి సర్వీస్ రూల్స్ మరో నాల్గు డిమాండ్ల సాధనకోసం యుఎస్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ర్యాలీ -ధర్నా.
  • 2004 నవంబరు 8- యుఎపిపిఎప్ ఆధ్వర్యంలో 50వేల మందితో రాజధానిలో ప్రభంజనంలా ర్యాలీ – బహిరంగసభ.
  • 2004 నవంబరు 24- పిఆర్సి నివేదిక విడుదల కోసం జిల్లా కేంద్రాల్లో జెఏసి ధర్నా.
  • 2004 డిసెంబరు 7 – కేంద్ర రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె హక్కుకై ఛలో పార్లమెంట్ లోక్సభ స్పీకర్కు మెమోరాండం సమర్పణ.
  • 2005 ఫిబ్రవరి 16 – ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యాన శాసన సభ ముట్టడికి పిలుపు – రాష్ట్ర మంతటా అరెస్టులు, ముఖ్యమంత్రితో చర్యల ఫలితంగా ముట్టడి విరమణ.
  • 2005 మార్చి-పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ట్రెజరీల ద్వారా జీతాల చెల్లింపునకు జీ.వో. విడుదల. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 8.5% మధ్యంతర భృతి ఉత్తర్వులు విడుదల.
  • 2005 ఏప్రిల్ 3- భద్రాచలంలో ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయుల రాష్ట్ర విద్యా సదస్సు/ జెసిటిఏ నాయకత్వాన పదవతరగతి, 7వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణ-రేట్లు పెంచుతూ ఉత్తర్వుల విడుదల.
  • 2005 జూలై 7- హైదాబాదులో ఎయిడెడ్ సిబ్బంది రాష్ట్ర సదస్సు ఏసిఎఐఇ ఏర్పాటు.
  • 2005 ఆగస్టు – పి.ఆర్.సి. ఆమలుకు దశలవారీగా ఉద్యమం. జెఏసి పిలుపు. ప్రభుత్వంతో ఒప్పందం.
  • 2005 సెప్టెంబర్ 29 – సమ్మెహక్కుకొరకు అఖిలభారత సార్వత్రికసమ్మె.
  • 2006 మే 22 – పదోన్నతులను కోరుతూ హైదరాబాద్లో జాక్టో ఆధ్వర్యాన ధర్నా.
  • 2006 జులై 18-సమస్యల పరిష్కారానికై జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఎ.పి.టి.ఎఫ్. ఆధ్వర్యాన ధర్నా
  • 2006 సెప్టెంబర్ 9, 10-విజయవాడలో జరిగిన రాష్ట్రకౌన్సిల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె. వేణుగోపాల్, షేక్ జిలానీ ఎన్నిక.
  • 2006 డిసెంబరు, 14- కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కువ్యతిరేకంగా దీర్ఘవ్యాపిత సార్వత్రికసమ్మె.
  • 2006 డిసెంబర్ 19 – ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్సు రక్షణకు అప్రెంటీస్ టీచర్ల, సమస్యల పరిష్కారానికై ఏ.పి.టి.యఫ్. ఆధ్వర్యాన హైదరాబాద్లో ధర్నా.
  • 2007 ఏప్రిల్ 8 – 12 జాక్టో ఆధ్వర్యాన 5 రోజులపాటు పదవ తరగతి స్పాట్ బహిష్కరణ.
  • 2007 జూలై 24 – ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై జిల్లాకలెక్టర్ కార్యాలయాలఎదుట ఏపిటియఫ్. ధర్నా.
  • 2007 అక్టోబరు 30- కేంద్రప్రభుత్వ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఉద్యోగుల దేశవ్యాప్తసమ్మె.
  • 2007 నవంబరు15- మునిసిపల్కా ర్పొరేషన్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై మునిసిపల్, కార్పొరేషన్ కార్యాలయాల ఎదుట ఏపిటియఫ్ ధర్నా.
  • 2008 ఫిబ్రవరి 6, 7, 8 – ఒంగోలులో విజయవంతంగా ఏ.పి.టి.యఫ్. వత్రోత్సవాలు – 17వ విద్యా వైజ్ఞానిక మహాసభలు – 12 వేల మంది హాజరు.
  • 2008 ఏప్రిల్ 9 నుండి 18 వరకు జాక్టో ఆధ్వర్యాన హైదరాబాద్లో నిరాహారదీక్షలు, 11-4-2008న నిరాహార దీక్షలకు మద్దతుగా 10వ తరగతి స్పాట్ సెంటర్లవద్ద పికెటింగ్, జాక్టోతో ప్రభుత్వ చర్చలు, ఒప్పందం.
  • 2008 జూలై 7 – 10 – ఉన్నత పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టుటకు వ్యతిరేకంగా ఏ.పి.టి.ఎఫ్., డి.టి.యఫ్.ల ఆధ్వర్యంలో 7,8,9 తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు, 10వ తేదీన జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహణ.
  • 2008 ఆగస్టు 20 – ప్రైవేటీకరణకు, అధిక ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె.
  • 2008 అక్టోబర్ 22 నవంబరు 3-ఒప్పందాలు అమలు చేయా లని డిమాండ్ చేస్తూ జాక్టో ఆధ్వర్యంలో 13 రోజుల పాటు విజయవంతంగా సమ్మె. 95% మంది ఉపాధ్యా యులు సమ్మెలో పాల్గన్నారు. 22న ప్రభుత్వంతో చర్చలు- 10 డిమాండ్లపై అంగీకారం-సమ్మె విరమణ.
  • 2009 అక్టోబర్ 9 ఫ్రీజోన్ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు
  • 2009 నవంబర్ 2, 3, 4 – ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై దశలవారీ పోరాటంలో భాగంగా పాత తాలూకా కేంద్రాలలో ఏ.పి.టి.ఎఫ్. ధర్నా నిర్వహణ.
  • 2009 నవంబర్ 21 దశలవారీ పోరాటంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలఎదుట ఏపిటిఎఫ్ ధర్నా నిర్వహణ.
  • 2009 నవంబర్ 29 సిద్దిపేటలో తెలంగాణ ఉద్యోగుల ఘర్జన
  • 2009 డిశంబరు 5 – దశలవారీ పోరాటంలో భాగంగా ఏ.పి.టి.ఎఫ్ ఆధ్వర్యాన హైదరాబాద్లో ధర్నా, ర్యాలీ.
  • 2009 డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామన్న కేంద్ర హెూంమంత్రి చిదంబరం
  • 2009 డిసెంబర్ 23 చిదంబరం 2వసారి ప్రకటణ
  • 2010 జనవరి 3 ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి ఘర్జన
  • 2010 జనవరి 6 ఇందిరాపార్క్ వద్ద జె.ఎ.సి నిరాహర దీక్షలు
  • 2010 ఫిబ్రవరి 13 శ్రీ కృష్ణ కమిటి విది విదానాలు ప్రకటణ
  • 2010 ఫిబ్రవరి 24-విద్యా హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అఖిలభారత విద్యాహక్కువేదిక ఆధ్వర్యాన ఢిల్లీలో భారీర్యాలీ.
  • 2010 జూన్ 17- అప్రెంటీస్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరి చేయాలని డిమాండ్ చేసి జాక్టో ఆధ్వర్యాన ‘చలో సెక్రటేరియేట్’ వేలాదిమంది అరెస్టు.
  • 2010 జులై 2 తెలంగాణ సాధన దీక్షావారం పాటింపు
  • 2010 జులై 4 తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభలు
  • 2010 సెప్టెంబర్ 7- ధరల పెరుగుదల, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె.
  • 2010 సెప్టెంబర్ 18– సమస్యల పరిష్కారం కోరుతూ, ఎ.పి.టి.ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయ ముట్టడి వందలాదిమంది అరెస్టు.
  • 2010 సెప్టెంబర్ 29,30 అక్టోబర్ 9,12-డైరెక్టర్ కార్యాలయలలో సమస్యల పరిష్కారం కోరుతూ ఎ.పి.టి.ఎఫ్ ఆధ్వర్యాన రిలే నిరాహార దీక్షలు డైరెక్టర్తో చర్చలు ఉద్యమ విరమణ.
  • 2010 నవంబర్ 8,16 జెఎసి ఆధ్వర్యాన హైదరాబాద్లో, జిల్లా కేంద్రాలలో నిరాహార దీక్షలు.
  • 2010 నవంబర్ 23 ఇంటి అద్దె ఎలవెన్సు హెల్త్ కార్డులు పోస్టుల భర్తీ మొదలైన డిమాండ్ల పరిష్కారానికి, జెఎసి ఆధ్వర్యాన హైదరాబాద్లో భారీ ర్యాలీ. లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవు.
  • 2011 జనవరి 6 శ్రీకృష్ణ కమిటి ప్రకటన
  • 2011 ఫిబ్రవరి, 25 సమస్యల పరిష్కారానికై జిల్లా కేంద్రంలో ర్యాలీలు ధర్నాలు
  • 2011 మార్చి 4 సహాయ నిరాకరణ విరమణ
  • 2011 మార్చి 10 మిలియన్ మార్చ్
  • 2011 మే 18 ఏపిటిఎఫ్ ఆధ్వర్యాన డైరెక్టరేట్ ముట్టడి.
  • 2011 _ జూన్ 22 ప్రొ॥ జయశంకర్ మరణం
  • 2011 జులై 5 జె.ఎ.సి. ఆధ్వర్యములో 48గంటల బందు
  • 2011 ఆగష్టు 31 ఏ.పి.టి.ఎఫ్.తో తెలంగాణ ప్రిసీడియం ఏర్పాటు
  • 2011 సెప్టెంబర్ 13 సకల జనుల సమ్మె ప్రారంభం
  • 2011 సెప్టెంబరు 23 ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రాలలో ధర్నాలు
  • 2011 అక్టోబర్ 14 కరీంనగర్ ఉపాధ్యాయ గర్జన
  • 2011 అక్టోబర్ 24 సకలజనుల సమ్మె విరమణ
  • 2011 డిసెంబరు 3 ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై ‘చలో అసెంబ్లీ’
  • 2012 సెప్టెంబర్ 16 హైదరాబాద్ లో తెలంగాణ జిల్లాల సదస్సు
  • 2012 సెప్టెంబర్ 30 సాగరహారం
  • 2012 నవంబర్ 27, 28 డిసెంబర్ 10న పి.ఆర్.సి హెల్త్ కార్డులు మొదలైన డిమాండ్ల సాధనకై జెఎసి జిల్లా కేంద్రాలలో ధర్నా.
  • 2013 సెప్టెంబర్ 29 సకలజనుల భేరి
  • 2013 అక్టోబర్ 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై సి.డబ్లు. సి తీర్మానాన్ని ఆమోదించిన కేంద్ర క్యాబినెట్
  • 2013 నవంబర్, 20 – పండిట్, పి.ఇ.టి పోస్టు అప్ గ్రెడేషన్, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర డిమాండ్ల సాధనకై హైదరాబాద్లో ఏ.పి.టి.ఎఫ్. ధర్నా.
  • 2014 జనవరి, 18 – పండిట్, పి.ఇ.టి పోస్టుల అప్డేషన్, ఎయిడెడ్, మునిసిపల్ సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాద్లో జాక్టో నిరసన దీక్ష.
  • 2014 మే, 28, 29, విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు, రాష్ట్ర విభజన సందర్భంగా రెండు రాష్ట్ర కమిటీలు ఆంధ్రప్రదేశ్లో ఏ.పి.టి.ఎఫ్, తెలంగాణలో టి.పి.టి.ఎఫ్ ఏర్పాటు.
  • 2014 మే 29 టిపిటియఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బి. కొండల్ రెడ్డి, వి. మనోహర్ రాజు ఎన్నిక
  • 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ
  • 2014 జూన్ 14 టి.పి.టిఫ్. ఆవిర్భావ సదస్సు హైదరాబాద్
  • 2014 ఆగష్టు 6 పోలవరం ఆర్డినెన్స్ వ్యతిరేకంగా భద్రాచలంలో సదస్సు.
  • 2014 అక్టోబర్ 11 “ప్రభుత్వ పాఠశాలల పటిష్ఠత – మన కర్తవ్యం”పై జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు.
  • 2014 అక్టోబర్ 25 తెలుగు పాఠ్యపుస్తకాలపై హైదరాబాద్లో కార్యశాల.
  • 2014 అక్టోబర్ 30 సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాలపై కార్యశాల.
  • 2014 నవంబర్ 2 అఖిల భారత విద్యాపోరాట యాత్ర ర్యాలీ సమావేశం.
  • 2014 నవంబర్ 27 తెలంగాణ జిల్లాలలో ర్యాలీలు, సభలు, సమావేశాలు.
  • 2014 డిసెంబర్ 4 భోపాల్లో ప్రదర్శన, బహిరంగసభ.
  • 2015 నవంబర్ 10, 11 రాష్ట్ర అధ్యయన తరగతులు – తూప్రాన్లో.
  • 2015 ఏప్రిల్ 20 విద్యాశాఖ కార్యదర్శితో చర్చలు – టి.పి.టి.ఎఫ్, డి.టి.ఎఫ్, టి.ఎస్.యు.టి.ఎఫ్.
  • 2015 మే 25 ప్రభుత్వ పాఠశాలలు ముసివేతకు వ్యతిరేకంగా జిల్లాలలో ర్యాలీలు.
  • 2015 జూన్ 16 ప్రభుత్వ బదిలీలకు వ్యతిరేకంగా నిరసనలు (3 సంఘాలు).
  • 2015 ఆగష్టు 19 జిల్లా కేంద్రాలలో ర్యాలీలు – ధర్నాలు- (17 డిమాండ్ల కొరకు).
  • 2015 సెప్టెంబర్ 29 టి.పి.టి.ఎఫ్. ఇందిరాపార్కు వద్ద ధర్నా.
  • 2015 అక్టోబర్ 13, 14 రాష్ట్ర అధ్యయన తరగతులు మహబూబాబాద్.
  • 2015 నవంబర్ 3 విద్యాపరిరక్షణ కమిటీ సదస్సు – సుందరయ్య విజ్ఞాన కేంద్రం.
  • 2015 నవంబర్ 4 విద్యాపరిరక్షణ కమిటీ -ఆర్ట్స్ కాలేజి ఎదురుగా ధర్నా.
  • 2015 డిసెంబర్ 7నుండి 14, అఖిల భారత విద్యాహక్కు వేదిక ఆధ్వర్యంలో జంతర్మంతర్ వద్ద ధర్నాలు.
  • 2016 ఫిబ్రవరి 16 చలో హైద్రాబాద్-ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ.
  • 2016 మార్చి 21 నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలని ర్యాలీలు జిల్లా/డివిజన్ కేంద్రాలలో.
  • 2016 ఏప్రిల్ 13 స్పాట్ కేంద్రాలలో భోజన విరామ ప్రదర్శనలు.
  • 2016 జూన్ 30 పి.ఆర్.సి. బకాయిలు, ఇ.హెచ్. ఎస్. – సక్రమ అమలుకై ఇందిరాపార్క్ వద్ద ధర్నా.
  • 2016 అక్టోబర్ 1 సిపిఎస్ రద్దుకై ఇందిరాపార్కు వద్ద ధర్నా.
  • 2017 జనవరి 11, 12 టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రథమ మహా సభలు – సిద్దిపేట.
  • 2017 ఫిబ్రవరి 6 కామన్ స్కూల్ విధానం కొరకు విద్యా పోరాటయాత్ర ప్రారంభం
  • 2017 ఫిబ్రవరి 20 విద్యాపోరాట యాత్ర ముగింపు.
  • 2017 జూన్ 23 పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులో చేర్చుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల.
  • 2017 ఆగష్టు 8,9,10 తేదీలలో సిపిఎస్ రద్దుకై అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు
  • 2017 సెప్టెంబర్ 1 సిపిఎస్ రద్దుకై జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు
  • 2017 నవంబర్ 24 సిపిఎస్ విధానం రద్దుకోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ ఐక్యవేదిక ‘ఛలో హైదరాబాద్’
  • 2017 డిసెంబర్ 2 సి.పి.ఎస్. రద్దుకై “ఛలో హైదరాబాద్” పిలుపు. వేలాది మంది ఉపాధ్యాయుల అరెస్టులు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు.
  • 2018 ఫిబ్రవరి 17 ఉప ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రితో ఉపాధ్యాయ సంఘాల సమావేశం
  • 2018 మార్చి 23 ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా టి.పి.టి.ఎఫ్. నిరసన ప్రదర్శనలు.
  • 2018 మార్చి 24 యు.ఎస్.పి.సి, జాక్టో మరియు టి.టి.జె.ఎ.సి.లతో జె.సి.టి.యు. ఆవిర్భావం.
  • 2018 మార్చి 31 ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రితో అపరిష్కృత సమస్యలు మరియు ఎస్.ఎస్.సి. రెమ్యూనరేషన్ పెంపుదలపై జె.సి.టి.యు. చర్చలు.
  • 2018 మే 5 మంత్రి వర్గ ఉపసంఘంతో ఉపాధ్యాయ సంఘాల సమావేశం.
  • 2018 మే 16 ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చలు.
  • 2018 జూలై 4 పి.ఆర్.సి. కమీషనర్కి టి.పి.టి.ఎఫ్. ప్రతిపాదనలు.
  • 2018 ఆగష్టు 23 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యర్శికి ముఖ్యమంత్రి హామీలు అమలు పరచాలని మెమోరాండం.
  • 2018 సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, ధర్యాలు.
  • 2018 సెప్టెంబర్ 2 ఉపాధ్యాయ, ఉద్యోగుల, పెన్షనర్ల ఐక్య వేదిక సి.పి.ఎస్. రద్దు, విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు.
  • 2018 సెప్టెంబర్ 14 తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 100 రోజుల విద్యా పోరాట యాత్ర గస్పార్క్ వద్ద ప్రారంభం.
  • ప్రొ॥ హరగోపాల్ తదితరులతో పాటు టి.పి.టి.ఎఫ్. రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. అశోక్ కుమార్ అరెస్టులు.
  • 2018 అక్టోబర్ 3 ఉపాధ్యాయ, ఉద్యోగుల, పెన్షనర్ల ఐక్య వేదికచే పాత జిల్లా కేంద్రాలలో సదస్సులు నిర్వహణ.
  • 2018 నవంబర్ 11 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఐక్య వేదికచే హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వేలాది మందిచే ధర్మాగ్రహ సభ.
  • 2018 డిసెంబర్ 2 విద్యాపోరాట యాత్ర కరీంనగర్లో ముగింపు సమావేశం.
  • 2019 ఫిబ్రవరి 18 అఖిల భారత విద్యా హక్కు వేదిక ఆధ్వర్యంలో ఢిల్లీలో హూంకార్ ర్యాలీ.
  • 2019 ఏప్రిల్ 20 ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలపై ఎస్ఎస్సి స్పాట్ కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు.
  • 2019 మే 25 టిఆర్టి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ధర్నా.
  • 2019 మే 29న టిపిటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
  • 2019 జూన్ 11 అపరిషృత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త నిరసనలు, ధర్నాలు.
  • 2019 జులై 12 అపరిషృత సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రాలలో నిరసనలు, ధర్నాలు.
  • 2019 జులై 20 ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలలో ధర్నాలు.
  • 2019 ఆగస్టు 3 సమస్యల పరిష్కారానికై ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయులచే మహాధర్నా.
  • 2019 సెప్టెంబర్ 01 పెన్షన్ విద్రోహ దినంగా జిల్లాలలో ర్యాలీలు.
  • 2019 అక్టోబర్ 05 ఆర్టీసి సమ్మెకు టిపిటిఎఫ్ సంఘీభావం.
  • 2019 అక్టోబర్ 14 ఆర్టీసీ సమ్మె సందర్భంగా పొడిగించిన దసరా సెలవులను రద్దు చేయాలని డిఇవో కార్యాలయాల ఎదుట ధర్నాలు.
  • 2020 19 జనవరి 2020న ఉపాధ్యాయ ఉద్యమంలో ఒక చారిత్రకమైన రోజు. రాష్ట్రంలో గత దశబ్ద కాలంగా విడివిడిగా పనిచేస్తున్న సంఘాలు టిటిఎఫ్, టిడిటిఎఫ్, టిపిటిఎఫ్లు కలిసి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున ఐక్యతా సదస్సు జరిగింది. టిపిటిఎఫ్గ పునర్నిర్మాణం అయ్యాయి.
  • 2020 మార్చి 13న ఉపాధ్యాయ, ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికై ఐక్య వేదిక తరుపున చలో అసెంబ్లీ ఇందిరాపార్కు వద్ద పోలీసులు వేలాది మందిని అరెస్టు, పోలీస్ స్టేషన్లలో నిర్భంధం.
  • 2020 ఆగస్టు 2,3,4,13,16 తేదీలలో నూతన విద్యావిధానం -2020పై వెన్నార్ పద్దతిలో సమావేశాలు.
  • 2020 అక్టోబర్ 28న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికై టిపిటిఎఫ్ అధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు.
  • 2020 డిసెంబర్ 6న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాలలో ర్యాలీలు సంఘీభావ దీక్షలు.
  • 2020 డిసెంబర్ 17న యుఎస్పిసి & జాక్టోల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో సామూహిక ధర్నాలు.
  • 2020 డిసెంబర్ 29న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని యుఎస్ ఎస్ & జాక్టో ఆధ్వర్యంలో హైదరాబాదులోనిఇందిరా పార్క్ వద్ద వేలాదిమంది ఉపాధ్యాయులతో మహాధర్నా నిర్వహించడమైనది.
  • 2021 జనవరి 9న తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద రైతుల పోరాటానికి సంఘీభావంగా ధర్నా.
  • 2021 జనవరి 23న పిఆర్సి కోసం నిరసన దీక్షలు జిల్లా కేంద్రాల్లోనూ ఇందిరా పార్కు వద్ద యుఎస్ పిసి & జాక్టో ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు.
  • 2021 జనవరి 28న రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కేజిబిల ముందు టీచర్ల సమస్యలపై నిరసన ప్రదర్శనలు.
  • 2021 మార్చి 22న అసెంబ్లీలో సీఎం గారు పిఆర్సి ప్రకటన.
  • 2021 ఆగస్టు 18న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యలపై మండల తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు.
  • 2021 ఆగస్టు 28న జిల్లా కేంద్రాలలో రెండవ దశ ఆందోళనలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు.
  • 2021 సెప్టెంబర్ 15న మూడో దశ ఆందోళనలో భాగంగా పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ గారి కార్యాలయం ముట్టడి.
  • 2021 డిసెంబర్ 17న ఉద్యోగుల విభజన ఉత్తర్వులు 317. తేదీ. 6.12.2021కి వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *